ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయంగా గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ
అమిత్ షా గారి నేతృత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయత్రకు వేలాది సంఖ్యలో బీజేపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చి కదం తొక్కారు. అడుగుడుగునా జై బీజేపీ నినాదాలతో మార్మోగిన యాత్ర మార్గం..ఎటు చూసినా కాషాయ జెండాలతో రెప రెపలాడింది.
SIRపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్, ఇండీ కూటమి రాజకీయాలకు గట్టి సమాధానమిచ్చేలా నిజాం కాలేజ్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ X రోడ్స్ వరకు పాదయాత్ర సాగింది.
అనంతరం భారీ సభను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ అమిత్ షా గారు... హైదరాబాద్‌ను నిజాం పాలన నుండి విముక్తి చేసి, భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన చారిత్రాత్మక కృషిని గుర్తుచేసుకున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిర్మూలించి అర్హులైన భారత పౌరుల ఓట్లు కాపాడేందుకు ఉద్దేశించిన SIR ప్రక్రియను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారు, డూప్లికేట్ ఓట్లు, ఆచూకీ లేని ఓటర్ల పేర్లను తొలగించడం వల్లనే ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని చెప్పారు. అలాంటి పేర్లు ఓటర్ల జాబితాలో ఎందుకు ఉండాలని ఆయన నిలదీశారు.